నవతెలంగాణ – కమ్మర్ పల్లి
యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి మండలంలోని అమీర్ నగర్ గ్రామంలో నిజామాబాద్ ఇంచార్జి పోలిస్ కమిషనర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో ప్రజలకు చక్కని నాటిక, పాటలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ బరువు కాదు బాధ్యత అన్నారు. రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు. మహిళల భద్రత కోసం రక్షణగా నిజామాబాద్ షీ టీమ్ రక్షణ కల్పిస్తుందని తెలిపారు.నిజామాబాద్ షీ టీం నెంబర్ 8712659795 లేదా డయల్ 100 కి ఫోన్చేయాలన్నారు.మొబైల్ ఫోన్ దొంగిలించిన, పోగొట్టుకున్న సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ రికవరి చేయడం జరుగుతుందని తెలిపారు. అత్యవసరసమయంలో డయల్ 100 ఉపయోగించుకోవాలని సూచించారు.మూడ నమ్మకాలు నమ్మవద్దని,మంత్ర తంత్రాలు పారద్రోలాలని కోరారు.ప్రతి గ్రామంలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాలు వల్ల గ్రామం సురక్షితంగా ఉంటుందని, ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం అన్నారు.ఆన్లైన్ మోసాలు గురించి అప్రమత్తంగా ఉండాలని వివరించారు.దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ 1930 ఫోన్ చేయాలన్నారు.గల్ఫ్ దేశాలకు వెళ్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,నకిలీ ఏజెంట్లు నిరుద్యోగులకు మాయమాటలు, లేనిపోని ఆశలు, అత్యశలు చూపించి మోసం చేస్తున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. అందరూ శాంతియుతంగా అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉండాలని ప్రజలకు సూచించారు. సమాజంలో జరుగతున్న నేరాలు, చట్టాల పై అవగాహన కల్పించారు.