జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి..

– అర్బన్, రూరల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం..
నవతెలంగాణ – వేములవాడ, వేములవాడ రూరల్

వేములవాడ అర్బన్ మండలం, రూరల్ మండలాల్లో ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్, రూరల్ ఎస్సై మారుతి జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని మంగళవారం అర్బన్, రూరల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. అర్బన్ మండలంలోని రుద్రవరం గ్రామంలో గ్రామస్తులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు, రూరల్ మండలంలోని బాలరాజు పల్లి, వెంకటం పల్లి గ్రామాలలో జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళా యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు గ్రామాల యువకులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి కృషి చేయాలని వారు అన్నారు. జిల్లా కేంద్రంలోని కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్ లో 13వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎస్ ఐ లు గ్రామస్తులకు తెలియజేశారు. యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని వారు  అవగాహన కల్పించారు. ప్రతి గ్రామానికి తిరుగుతూ 60 కంపెనీల సహాయంతో సుమారు 1000 కి పైగా ఉద్యోగాలు, యువతీ యువకులకు జాబ్ అందించాలని ఉద్దేశంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా యువతి యువకులు జాబ్ మేళాలో పాల్గొనాలని,   సర్టిఫికెట్లు తీసుకొని  రావలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు.