నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివేకానంద స్టడీ సెంటర్ ను యువత సద్వినియోగం చేసుకోవాలని కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి కోరారు. సోమవారం మండల కేంద్రంలోని శిశు మందిర్ లో పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న యువతీ యువకుల కోసం ఏర్పాటు చేసిన వివేకానంద స్టడీ సెంటర్ ను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ ఇంతటి గొప్పకార్యాన్ని నిర్వహిస్తున్న తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘాన్ని అభినందిస్తూనే, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమానికి తన వంతుగా ఆర్థికంగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. తపస్ జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పట్ల నిరంతరంగా ఉద్యమిస్తూనే భావి తరాలకు ఉపయోగపడే ఈ కార్యక్రమం చేయడం పట్ల కమ్మర్ పల్లి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కార్యవర్గాన్ని అభినందించారు. వివేకానంద స్టడీ సెంటర్ నిర్వహణ కోసం భవనాన్ని సమకూర్చిన శిశు మందిర్ యాజమాన్యాన్ని అభినందించారు. అంతకుముందు వివేకానంద స్టడీ సెంటర్ ను ఎస్ఐ అనిల్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, పిల్లి ఈశ్వరయ్య, తపస్ మండల అధ్యక్షులు కిషన్, ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమేష్, డివిజన్ కార్యదర్శిలు ఆనంద్, శంకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.