– నియంతపాలన నుంచి విముక్తి పొందాలి
– బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్యయాదవ్
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
నియంత పాలన నుంచి విముక్తి పొందాలంటే యువత ముందుండి బీఎస్పీని గెలిపించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జానయ్యయాదవ్ కోరారు.ఆదివారం జిల్లాకేంద్రంలోని నిర్వహించిన యూత్ సమావేశంలో ఆయన మాట్లాడారు.కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగ నియామకాలు లేక యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.నిధులు,నియామకాల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన బీఆర్‌ఎస్‌కు ప్రజలు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కెేసీఆర్ కుటుంబం దోచుకుంటుంటే, నల్లగొండ జిల్లాను జగదీశ్‌రెడ్డి కుటుంబం దోచుకుంటుందని ఆరోపించారు. 2014 ఎన్నికలకు ముందు జగదీశ్‌రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఏ విధంగా ఉందో సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు ఆలోచిం చాలని కోరారు.ఏమీ లేని స్థాయి నుంచి వచ్చిన మంత్రి రూ.1.50కోట్ల కారులో తిరుగు తున్నాడని, అభివద్ధి ముసుగులో కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని ఆరోపి ంచారు. నూతనంగా నిర్మిం చిన ప్రభుత్వ కార్యాలయాల్లో సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వకుండా తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు ఒక ఉద్యోగానికి 5 లక్షల రూపాయలు చొప్పున అమ్ముకున్న ఘనత జగదీశ్‌రెడ్డికే దక్కు తుందన్నారు.ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకోవడం నిజం కాకపోతే సూర్యాపేట పట్టణంలోని నడిబొడ్డున చర్చకు రావాలని డిమాండ్ చేశారు.సొంత నియోజకవర్గం కానప్పటికీ జగదీశ్‌రెడ్డికి రెండు పర్యాయాలు ఓట్లు వేసి సూర్యాపేట ప్రజలు గెలిపిస్తే మా సంపదను దోచుకొని ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు.రానున్న ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించి ఏనుగు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. అనంతరం పండగ లింగయ్య బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి వట్టె రేణుకయాదవ్,కౌన్సిలర్లు గండూరి పావని కపాకర్,గండూరి రాధిక రమేష్, ధరావత్ నీలాబాయి లింగానాయక్, సర్పంచులు కేశబోయిన మల్లయ్యయాదవ్, బోడపట్ల కవితశ్రీను, ఎంపీటీసీ ఇందిర, నాయకులు చాంద్‌పాషా, బాణాల విజరు, సుంకరబోయిన రాజు, మీర్ అక్బర్, మాజీ సర్పంచ్ వెంకటయ్య, మాజీ ఎంపీటీసీ మట్టపల్లి ఉమా శ్రీనివాస్, బీఎస్పీ నాయకురాలు లలిత, కుంభంనాగరాజు, మందలింగరాజు, నెమ్మాది మల్సూర్, మోదాల విజరుకుమార్, బీసీ లింగయ్య, జటంగి మహేష్, బారి అశోక్, స్టాలిన్ పాల్గొన్నారు.