వివేకానంద ఆశయాల సాధనకు యువత కృషి చేయాలి

– ప్రభుత్వ విప్ బీర్ల

నవతెలంగాణ-బొమ్మలరామరం 
వివేకానంద ఆశయాల సాధనకు యువత కృషి చేయాలని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు.బొమ్మలరామారం మండలంలోని తూముకుంట గ్రామంలో వివేకానంద విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నేటి యువత వివేకానంద ఆశయాల సాధనకు యువత కృషి చేయాలని కోరారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మన్నెం నరేందర్ రెడ్డి, సురేష్, శ్రీశైలం, లక్ష్మణ్ వెంకటేష్, నరసింహులు, రాజు, రమేష్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.