గంజాయి మత్తులో యువత

Youth under the influence of marijuana– యువతపై గాంజా పంజా
– గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్న పోలీసులు
– వివరాలు వెల్లడించిన సీఐ రాములు
నవతెలంగాణ-కొడంగల్‌
కొడంగల్‌ నియోజకవర్గంలో గంజాయి గుప్పుమం టుంది. గుట్టుగా రవాణా అవుతుంది, పల్లెల్లో యువకులు కొందరు మత్తుకు బానిసలుగా మారారు. దౌల్తాబాద్‌ మం డలంలోని రావులపల్లి, మాటూర్‌, చంద్రకల్‌, దౌల్తాబాద్‌ గ్రామాలకు చెందిన యువకులు గంజాయికి అలవాటు పడ డంతో అదే అదునుగా భావించిన అక్రమార్కుడు కర్ణాటక సేఢం ప్రాంతం నుంచి తరలిస్తూ దౌల్తాబాద్‌ చెరువు కట్టపై పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా సయ్యద్‌ యాకూబ్‌ సేడం గ్రామానికి చెందిన వ్యక్తి రెండేండ్లుగా గంజాయికి అలవాటు పడి దౌల్తాబాద్‌ మండలంలోని రావుపల్లి, దౌల్తా బాద్‌, మాటూర్‌, కొడంగల్‌ మండలంలోని రుద్రారం గ్రా మాలలో యువకులకు అమ్ముతూ సోమవారం పోలీసులకు పట్టుబడ్డాడు. దౌల్తాబాద్‌ ఎస్సై రమేష్‌ కుమార్‌తో కొడం గల్‌ సీఐ రాములు వివరాలు వెల్లడించారు. సేడం గ్రామా నికి చెందిన సయ్యద్‌ యాకుబ్‌, దౌల్తాబాద్‌ మండలంలో 950 గ్రాముల గంజాయి 20000 విలువచేసే గంజాయిని విక్రయించేందుకు వస్తు దౌల్తాబాద్‌ చెరువు కట్టపై పోలీ సులు తనిఖీలు నిర్వహించగా తప్పించిక్కునేందుకు ప్రయ త్నించిన యాకుబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, యాకూబ్‌ చేతిలో ఉన్న కవర్‌ తీసుకుని చూడగా గంజాయి ఉన్నట్లు గమనించిన పోలీసులు పోలీస్‌ స్టేషన్‌కు తరలిం చారన్నారు. గంజాయి విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లల అల వాట్లను గమనించాలన్నారు. సయ్యద్‌ యాకూబ్‌ పై పోలీ సులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించారు.
చాలామంది గంజాయికి అలవాటు పడ్డారు, గ్రామాల లో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పొట్లా లలో చుట్టి అనుకున్న చోటుకి చేరవేస్తున్నారు. యువకుల బానిసత్వాన్ని ఆసరా చేసుకున్న అక్రమార్కులు ఆడింది ఆటగా పాడిందే పాటగా దందాను సాగిస్తున్నారు.
గంజాయి పొట్లాలను పలు రవాణా సాధనాల ద్వారా కర్ణాటక, ముంబై, తదితర ప్రాంతాల నుండి కొడంగల్‌ ప్రాంతానికి తీసుకువస్తూ కొడంగల్‌ ప్రాంత యువకుల జీవితాలతో ఆటలాడుతున్నారు. ఈ వ్యాపారానికి అడ్డుకట్ట వేయకపోతే మంచి భవిష్యత్తు ఉన్న యువకులు దిగి వారి జీవితాలను నాశనం చేసుకునే అవకాశం ఉంది.
ఆరోగ్యం పై చెడు ప్రభావం
గంజాయికి అలవాటు పడిన యువకులు చివరకు గంజాయి లేకుండా తాము ఉండలేమని స్థితికి చేరుకుం టారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ మత్తులో చెడు వ్యసనాలకు, నేరాలకు పాల్పడే అవకాశం ఉందని, కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారని విషయాన్ని గమనించకపోవడంతో వారు చెడు సావాసా లతో గంజాయికి బానిసలుగా మారుతున్నారు. ఇప్పటికైనా అధికారులు గంజాయి పై ప్రత్యేకంగా నిఘ ఉంచకపోతే యువకుల భవిష్యత్తు అంధకారంలో ఉంటుందని పలువు రు అభిప్రాయపడుతున్నారు.