నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రానికి చెందిన ఇతర పార్టీకి చెందిన యువకులు శుక్రవారం మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరారు. పార్టీలో చేరిన వారికి షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, భిక్నూర్ పట్టణ అధ్యక్షులు అందె దయాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి చేపూరి రాజు, మండల ఉపాధ్యక్షులు స్వామి, జిల్లా నాయకులు సిద్దగౌడ్, ఆంజనేయులు, కిరణ్ మండల కార్యదర్శి రమేష్ రెడ్డి, సూర్యకాంత రెడ్డి,యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు రవి, తదితరులు పాల్గొన్నారు.