వైయస్ రాజశేఖర్ రెడ్డి సేవలు మరువలేనివి: తహేర్ బిన్ హాందాన్

నవతెలంగాణ – కంఠేశ్వర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ భవన్ లో సోమవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తాహెర్బిన్ హంధాన్ మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డి సేవలు ఎన్నటికీ మరువలేనివని, ఎల్లప్పుడూ పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించిన వ్యక్తి వైయస్సార్ అని, వైయస్సార్ లేని లోటు ఎవరు తీర్చలేని ఆయన అన్నారు. మరి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని జిల్లాలో విద్యార్థుల కోసం తెలంగాణ యూనివర్సిటీ ఆయన హయాంలోని నిర్మించడం జరిగిందని, అదేవిధంగా మెడికల్ కళాశాల ఆయన ఆయంలోనే వచ్చిందని, రైతాంగానికి ఉపయోగపడే విధంగా గుత్తా అల్లి సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఆయన హయాంలోని రావడం జరిగిందని ఆయన అన్నారు. మరి ముఖ్యంగా జిల్లాతో ప్రత్యేక అనుబంధంలో భాగంగా రాజశేఖర్ రెడ్డి ఆయన యొక్క పుట్టినరోజు నిజం సాగర్ ప్రాజెక్టు వద్ద ఒకసారి జరుపుకోవడం జరిగిందని, జిల్లాకు రాజశేఖర్ రెడ్డి తో ప్రత్యేక అనుబంధం ఉందని ఆయన గుర్తు చేశారు. అతిపిన్న వయసులోనే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమితులై కాంగ్రెస్ పార్టీకి దశ దిశ చూపిన వ్యక్తి అని ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరిగే విధంగా అభివృద్ధి పనులు చేసిన వ్యక్తి అని తాహెబ్బిన్ హాందాన్ అన్నారు.కావున ప్రతి ఒక్కరూ రాజశేఖర్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్, రాష్ట్ర ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శి విపుల గౌడ్, సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, బీసీ సెల్ అధ్యక్షులు నరేందర్, మహిళా కాంగ్రెస్ నాయకులు చంద్రకళ,స్వామి గౌడ్,సాయిలు, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.