రాష్ట్రం అప్పుల పాలు : వైఎస్‌ షర్మిల

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా సీఎం కేసీఆర్‌ మార్చారని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల విమర్శించారు. గురువారం గన్‌పార్క్‌ వద్ద అమర వీరుల స్థూపానికి ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎంకు 10 ప్రశ్నలను సందించారు. దశాబ్ది ఉత్సవాలు చేసే ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తొమ్మిదేండ్లుగా రాష్ట్ర ప్రజలను కేసీఆర్‌ మోసం చేస్తున్నారని విమర్శించారు.రూ.4.5లక్షల కోట్ల అప్పులు చేసి ప్రతి ఒక్కరి నెత్తిపైనా లక్షన్నర అప్పు చేశారని తెలిపారు.
ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్నారని విమర్శించారు.