సిట్టింగులకే సీట్లు ఇవ్వాలి.. : వైఎస్‌ షర్మిల

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేసీఆర్‌ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత లేదని చెబుతున్న సీఎం కేసీఆర్‌ అదే నిజమైతే..సిట్టింగ్‌లకే సీట్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలపగలరా? అని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో తొమ్మిదేండ్లుగా అవినీతి తీవ్రంగా పెరిగిందని తెలిపారు. కుటుంబానికి పదవులిచ్చి, ఉద్యమ ద్రోహులను నెత్తిన పెట్టుకున్నారని విమర్శించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని గుర్తుచేశారు.