ఎంపీపీ అబ్దుల్‌ రకాక్‌ను సన్మానించిన వైఎస్సాఆర్‌

నవతెలంగాణ-సిటీబ్యూరో
సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ అనేది నినాదం కాదు.. తమ పార్టీ విధానం అని బీజేపీ పై ఉన్న ప్రత్యర్ధి పార్టీల విమర్శలు, అపోహలు మాత్రమే అని నిరూపిస్తూ రాష్ట్రం లో అధికార మార్పిడి జరిగిన తర్వాత స్థానిక సంస్థల్లో మొట్టమొదటి మండల పరిషత్‌ అధ్యక్షులుగా ముస్లిం వర్గాలకు అవకాశం కల్పిస్తూ నిర్మల్‌ జిల్లా భైంసా మండల ఎంపీపీగా అబ్దుల్‌ రజాక్‌ ఎన్నికవ్వడంలో కీలక పాత్ర పోషించిన ముదోల్‌ ఎమ్మెల్యే రామారావు పాటిల్‌కి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర ఎంపీపీల పోరం అధ్య క్షుడు, ఘట్కేసర్‌ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం భైంసా మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో రామారావు పాటిల్‌, నూ తన భైంసా ఎంపీపీ అబ్దుల్‌ రజాక్‌ని కలిసి సన్మానించారు. అధికార వికేంద్రీకరణ ద్వారా అట్టడుగు స్థాయిలో అభివృద్ధికి కారణమైన స్థానిక సంస్థలను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో నిర్వీర్యం చేసిన అంశాన్ని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్‌ నేతత్వంలోని ప్రభుత్వమైనా రాజ్యాంగ బద్దంగా స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను విడుదల చేసి బలమైన స్థానిక ప్రభుత్వాల ద్వారా ప్రజలకు అభివద్ది సంక్షేమ పలాలు అందేలా పని చేయాలి కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సత్యనారా యణ రెడ్డి, నరేష్‌, అశోక్‌, వంశీధర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.