పేదల పక్షపాతి వైయస్సార్..

నవతెలంగాణ – సూర్యాపేట
ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు ముఖ్యమంత్రి గా పని చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల పక్షపాతి గా పని చేశారని మైనార్టీ జిల్లా నాయకులు సాజిద్ తెలిపారు.వైయస్సార్ 75వ జయంతి సందర్భంగా సోమవారం స్థానిక ఖమ్మం క్రాస్ రోడ్ లో మొక్కలను నాటిన అనంతరం ఆయన మాట్లాడారు.వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్టాన్ని అభివృద్ధిపధంలో నడిపారని గుర్తు చేశారు.నిరుపేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా విద్యార్థుల జీవితాలు మార్చిన గొప్ప నాయకుడు వైఎస్ అని కొనియాడారు. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని ఆయన లేని లోటు తీరనిదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు షబ్బీర్, ఉపెంధర్, విజయ్,మధు,మీసాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.