అశ్వారావుపేట లో వైఎస్సార్ జయంతి

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ 75 వ జయంతి ని శనివారం కాంగ్రెస్ ఆద్వర్యంలో నిర్వహించారు. స్థానిక మూడు రోడ్ల కూడలి లో గల ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సున్నం నాగమణి,మొగళ్ళపు చెన్నకేశవరావు,తుమ్మ రాంబాబు, వగ్గెల పూజ, సత్యవరపు తిరుమల బాలగంగాధర్, వేముల భారతి ప్రతాప్ లు పాల్గొన్నారు.