ప్రజల మనసుల్లో మహనీయునిగా నిలిచిన వైయస్ఆర్

– ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జన్మదిన వేడుకలు
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసి ప్రజల మనసులో మహనీయునిగా నిలిచిన గొప్ప వ్యక్తి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని పీసీసీ సభ్యులు కేడం లింగమూర్తి అన్నారు. సోమవారం హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి  75వ పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గంలోని గండిపల్లె గౌరవెల్లి ప్రాజెక్టుతో పాటు తోటపల్లి రిజర్వాయర్ కూడా ఫౌండేషన్ చేశాడన్నారు. పేద ప్రజల యొక్క బాధలు తెలుసుకున్న నాయకుడిగా 104. 108 ఆరోగ్యశ్రీ అలాంటి పథకాలు పెట్టారన్నారు. రైతులకు ఉచిత కరెంటు లక్ష రూపాయల రుణమాఫీ ఇచ్చిన నాయకుడన్నారు. నిత్యం పేద ప్రజల కోసం పనిచేసిన రాజశేఖర్ రెడ్డి సేవలు మరువలేనివని కొనియాడారు.ఈ కార్యక్రమంలో  హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు ,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ ,కౌన్సిలర్స్ వల్లపు రాజు, భూక్య సరోజన, కోమటి స్వర్ణలత సత్యనారాయణ, పున్నసది లావణ్య, ఎండి. హసన్, వెన్న రాజు,బోoగొని శ్రీనివాస్, పోలు సంపత్ తదితరులు పాల్గొన్నారు.