అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌టీపీ సత్తా చూపిస్తాం

– వైఎస్సార్‌టీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు శీలం శ్రీను
నవతెలంగాణ-షాద్‌నగర్‌
అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌టీపీ సత్తా చాటుతుందని, వైఎస్‌ షర్మిల నాయకత్వంలో ప్రజలు పార్టీ కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్‌టీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు శీలం శ్రీను అన్నారు. మంగళవారం షాద్‌నగర్‌ నియోజకవర్గం వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ఎమెల్యే అభ్యర్థిత్వానికి లోటస్‌ పాండ్‌ పార్టీ కార్యాయంలో పార్టీ ముఖ్యనేతలు పిట్టా రాంరెడ్డి, ముస్తఫా, లింగారెడ్డిలకు శీలం శ్రీను దరఖాస్తును అందజేశారు. ఈ సందర్భంగా శీలం శ్రీను మాట్లాడుతూ దాదాపు పన్నెండు సవత్సరాల నుండి వైఎస్‌ఆర్‌ కుటుంబానికి వీర విధేయుడిగా ఉంటూ, ప్రజల సమస్యలపై వారి పక్షాన ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశానని అన్నారు. షర్మిలక్క పార్టీ పెట్టినప్పటి నుండి ప్రజా సమస్యలపై పోరాడాలని ఎలాంటి పిలుపునిచ్చిన, ఏ కార్యక్రమం ఇచ్చిన ముందుండి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అన్నారు. కావున షర్మిలమ్మ నా దరఖాస్తుని పరిగణలోకి తీసుకొని టికెట్‌ ఇస్తే షాద్‌నగర్‌ నియోజకవర్గంలో ఆమె నాయకత్వాన్ని బలపరుస్తూ, వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ జెండాను ప్రతి గడపకు తీసుకెళ్లి మంచి మెజారిటీ ఓట్లు సాధించి గెలుపు దిశగా పయనిస్తానని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌టీపీ నాయకులు నరేష్‌, ఆవ శివ, మహేష్‌, ప్రవీణ్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.