న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ లావా మార్కెట్లోకి కొత్తగా యువ 5జి ఫోన్‌ను విడుదల చేసినట్లు వెల్లడించింది. ఈ మేడ్ ఇన్ ఇండియా ఫోన్ ధరను రూ.9,499గా నిర్ణయించినట్లు తెలిపింది. 4.జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో ఆవిష్కరించినట్లు పేర్కొంది. 128 జీబీ వేరియంట్ ధరను రూ.9,999గా ప్రకటించింది. 50ఎంపీి ఏఐ డ్యూయల్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ దీని ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. జూన్ 5 నుంచి అమెజాన్‌లో లభ్యం కానుందని తెలిపింది.