కాల్వపల్లి లో మొక్కలు నాటిన జడ్పీ ఛైర్పర్సన్ బడే నాగజ్యోతి

నవతెలంగాణ -తాడ్వాయి 
కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని కాల్వపల్లి లో ములుగు జడ్పీ చైర్మన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ములుగు జడ్పీ చైర్మన్ నాగజ్యోతి మాట్లాడుతూ రాష్ట్రంలో పచ్చదనం పెంపును ఉద్యమంగా చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం, మరో బృహత్‌ కార్యాచరణకు సిద్ధమైంది అనిఉ. కోటి మొక్కలను నాటే కార్యక్రమం ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో కోటి వృక్షార్చన భాగంగా ములుగు జిల్లా పరిషత్తు చైర్పర్సన్ బడే నాగజ్యోతి మొక్కలను కాల్వపల్లి లో నాటారు. ఈ కార్యక్రమం లో కాల్వపల్లి గ్రామస్థులు, పార్టీ శ్రేణులు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.