పవర్‌ఫుల్‌ కంటెంట్‌తో ‘జీబ్రా’ : చిరంజీవి

'Zebra' with powerful content : హీరో సత్య దేవ్‌, డాలీ ధనంజయ నటించిన మల్టీ స్టారర్‌ ‘జీబ్రా’. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఓల్డ్‌ టౌన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌ఎన్‌ రెడ్డి, ఎస్‌ పద్మజ, బాల సుందరం, దినేష్‌ సుందరం నిర్మించారు. ఈ మూవీ ఈనెల 22న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను చిరంజీవి లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’కంటెంట్‌ బాగుండాలి. సినిమాలో ఎంటర్టైన్మెంట్‌ ఉండాలి. అది ఆస్వాదించడానికి ప్రేక్షకులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. సినిమాలు ఆడవు, ప్రేక్షకులు ఓటీటికి అలవాటు పడిపోయారనే మాట అవాస్తవం. సినిమా బాగుంటే ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారు. వాళ్ళని మెప్పించేలా మనం చాకచక్యంగా సినిమా తీయాలి. ‘జీబ్రా’ ట్రైలర్‌ చూసినప్పుడు మంచి కంటెంట్‌తో ఉందని అర్థమైంది. ఇందులో చాలా మంచి ఎంటర్టైన్మెంట్‌, స్టార్‌ కాస్ట్‌ ఉంది. అద్భుతమైన యాక్టర్స్‌ ఉన్నారు. కిక్‌ ఇచ్చే క్రైమ్‌ ఎలిమెంట్‌, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ కూడా ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమా సూపర్‌ హిట్‌ బొమ్మ అవుతుంది. సత్యదేవ్‌ నాకు ఇంకో తమ్ముడు. తన సినిమాలు చూస్తున్నప్పుడు చాలా ఇంటెన్స్‌గా పెర్ఫార్మన్స్‌ చేస్తున్నాడు అనిపిస్తుంది. నిర్మాతలు బాల, దినేష్‌, ఎస్‌ ఎన్‌ రెడ్డి చాలా ప్యాషన్‌తో ఈ సినిమా తీశారు. డైరెక్టర్‌ ఈశ్వర్‌ కార్తీక్‌ చాలా వండర్ఫుల్‌గా తెరకెక్కించారు. టీమ్‌ అందరికీ ఈ సినిమా అద్భుతమైన విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.’అన్నయ్య (చిరంజీవి) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి  రావడంతో మా సినిమా ఆల్రెడీ హిట్‌ అయిపోయిందని నమ్మకం వచ్చేసింది. ఆయనతో నటించిన ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా బిగ్గెస్ట్‌ హై ఇన్‌ మై లైఫ్‌. ఈ సినిమా నాకు డెబ్యూ లాంటిది. ఇది అన్నయ్యకి డెడికేట్‌ చేస్తున్నాను’ అని హీరో సత్య దేవ్‌ చెప్పారు.