సత్య దేవ్, డాలీ ధనంజరు నటించిన మల్టీ స్టారర్ చిత్రం ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించారు. ఈ సినిమా ఈనెల 22న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో సత్య దేవ్ మాట్లాడుతూ,’ఇది వెరీ యూనిక్ ఎంటర్‌టైనర్. ఇందులో బ్యాంకర్ రోల్ ప్లే చేశాను. నా గత సినిమాలకి భిన్నంగా ఉండే పాత్ర. కొత్త సత్యదేవ్‌ని చూస్తారు. చాలా ఫ్రెష్ కంటెంట్‌తో దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాలను అలరిస్తుంది. ఓ మంచి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను అని గర్వంగా ఉంది’ అని అన్నారు.