సత్య దేవ్, డాలీ ధనుంజరు నటిం చిన మల్టీ స్టారర్ ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రం ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. ఓ కొత్త ప్రపంచాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఆర్టిస్టిక్ ఎలిమెంట్స్‌ని బ్లెండ్ చేయడం కొన్ని కథలకే కుదురుతుంది. ‘జీబ్రా’లో అది కుదిరింది. ఇందులో అన్ని ఎమోషన్స్ ఆర్గానిక్‌గా బ్లెండ్ అయ్యాయి. మాస్ ఎలిమెంట్స్, బ్యాంకింగ్ జోనర్, మనీ లాండరింగ్, కామెడీ, లవ్, ఫ్రెండ్షిప్‌తో సినిమా అద్భుతంగా వచ్చింది. బ్యాంకింగ్ వరల్డ్‌లో కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. అవి లైమ్ లైట్‌లో పెట్టి ప్రేక్షకులకు చూపించాలనే ఆలోచన వచ్చింది. బ్యాంకింగ్, మనీ లాండరింగ్ ఇలా రెండు వరల్డ్స్ బ్లెండ్ చేసి ఈ కథ రాశాను. ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా ఇంటెలిజెంట్‌గా ఉంటుంది. కానీ రైటింగ్ సింపుల్‌గా ఉండటంతో ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. – ఫైనాన్సియల్ క్రైమ్ చుట్టూ ఉండే కథ ఇది. బ్లాక్ అండ్ వైట్ సూచించే యానిమల్‌గా ‘జీబ్రా’ టైటిల్‌ని పెట్టడం జరిగింది. కొన్ని ట్రూ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఈ కథ రాశాను. ఇది మాస్ డ్రామా. ఈ కథకి సత్యదేవ్, డాలీ ధనుంజరు అద్భుతంగా న్యాయం చేశారు. వీరిద్దరి పాత్రలు ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేస్తాయి. కథానుగుణంగా ఎక్కడా రాజీపడకుండా మా నిర్మాతలు ఈ సినిమా నిర్మించారు.