ఫ్లటర్‌లో జీ పెట్టుబడులు

న్యూఢిల్లీ : టెక్నాలజీ స్టార్టప్‌ ప్లటర్‌లో పెట్టుబడులు పెట్టినట్టు జీ మీడియా కార్పొరేషన్‌ అనుబంధ సంస్థ జీ ఆకాష్‌ న్యూస్‌ తెలిపింది. ప్లటర్‌ డిజిమేట్‌లో రూ.3.75 కోట్ల పెట్టుబడులు అందిం చినట్టు పేర్కొంది. ఈ నిధుల కేటాయింపును 2024 డిసెంబర్‌ 31 కల్లా పూర్తి చేయనున్నట్టు తెలిపింది. 2021లో ప్రారంభించిన ఫ్లటర్‌ 2023-24లో రూ.2.5 కోట్ల రెవెన్యూ నమోదు చేసింది.