
సబ్సిడీ పైన జీలుగ విత్తనాలు అందజేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వము రైతులకు సబ్సిడీ పైన పచ్చి రొట్టెలు అందజేయుచున్నదని, తొలకరి వర్షాలు పడిన వెంటనే వరి వేసుకునే నెలలో రెండున్నర ఎకరాలకు 30 కిలోల చొప్పున ఎకరానికి 12 కిలోలు విత్తనాలు నేలలో వెదజల్లాలని, 25 నుండి 30 రోజులకు ఈ పంట పూతదశకు వస్తుందని, నాటు వేసుకునే ముందు ఈ పచ్చి రొట్ట పైరును భూమిలో కలియదునాలని, ఈ పచ్చి రొట్ట పైరు వేసుకోవడం వలన భూసారం బాగా పెరుగుతుందని, చవుడు నేలల్లో వేసినట్లయితే చౌడు తగ్గిపోతుందని, ఒక ఎకరానికి 10 టన్నుల పశువుల పెంట పోసినంత బలము భూమికి లభిస్తుందని తెలిపారు. జీలుగ -30 కిలోల సంచికి ₹ 2790/- రూపాయలు. దీనిలో సబ్సిడీ ₹1674 రైతు చెల్లించవలసింది ₹1116 /- రూపాయలు, జనుము 40 కిలోల సంచి మొత్తం ధర ₹ 3620/- సబ్సిడీ₹ 2172 రైతు చెల్లించవలసింది ₹1448 , పిలిపిసరా 20 కిలోల సంచి ₹2710/- సబ్సిడీ ₹1626 రైతు చెల్లించవలసింది ₹1084 /-, ఈ విత్తనాలు జిల్లాలోని అన్ని కోఆపరేటివ్ సొసైటీలలో లభిస్తాయని, రైతులందరూ పచ్చిరొట్ట విత్తనములను తమ పొలాలలో వరి వేయి పొలంలో తప్పకుండా వేసుకోవాలని ప్రకటనలో కోరారు.