అర్హతున్న అందని గృహజ్యోతి జీరో బిల్లులు.?

Malhar– ఆపరేటర్ల తప్పిదాలు….ప్రజలకు శాపంగా మారిన వైనం
– ప్రజాపాలన సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షణలు
– ఎడిట్ అప్సన్ లేదంటున్న అధికారులు
– అయోమయంలో 1,863 మంది లబ్ధిదారులు
నవతెలంగాణ- మల్హర్ రావు
అర్హత ఉన్న గృహజోతి జీరో బిల్లలు,సబ్సిడీ గ్యాస్ అందడం లేదని నిరుపేద ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.ఆన్లైన్లో ఎంట్రీలో ఆపరేటర్లు చేసిన తప్పిదాలతో వందలాది సామాన్య ప్రజలు గృహజ్యోతి,సబ్సిడీ గ్యాస్ పథకాలకు దూరమై ఈ నెలలో విద్యుత్ బిల్లులు వచ్చాయి.దీంతో ప్రజాపాలన సేవా కేంద్రం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.అన్ని అర్హతలు ఉన్నప్పటికీ జీరో బిల్లులకు బదులుగా వందల బిల్లులు చేతికందడంతో అయోమయానికి గురవుతున్నారు.ఇదేమిటని ఇటు విద్యుత్ శాఖ, అటు మండల పరిషత్ అధికారులను ప్రశ్నిస్తే మళ్ళీ దరఖాస్తులు చేసుకోవాలని సూచిస్తున్నారు.దీంతో ప్రజలు జిరాక్స్ పత్రాలతో ప్రజాపాలన, మిసేవా కేంద్రం వద్దకు పరుగులు పెడుతున్న పరిస్థితి.ప్రభుత్వం ఎడిట్ అప్సన్ ఇవ్వకపోవడంతో తాము ఏమి చేయలేమని మండల పరిషత్ కార్యాలయంలో ఉన్న ఆపరేటర్లు అంటున్నారు.
నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టింది.మండలంలో 15 గ్రామపంచాయితీల్లో గ్రామసభలు నిర్వహించి అభయహస్తం పేరిట అర్హులైన వారి నుంచి 9,357 దరఖాస్తులు స్వికరించారు.ఇందులో గృహజ్యోతి 200 యూనీట్లు ఉచిత విద్యుత్ కోసం 9,357 దరఖాస్తులు చేసుకున్నారు.వచ్చిన దరఖాస్తులు ఆన్ లైన్ నమోదు చేయడంలో మాత్రం భారీగా తప్పిదాలు జరిగినట్లుగా తెలుస్తోంది.
గృహజోతి,సబ్సిడీ గ్యాస్ పథకాలకు దూరమైన అర్హులు …
మార్చి 1 నుంచి విద్యుత్ సిబ్బంది బిల్లులు జారీ చేస్తున్నారు.అయితే గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్న చాలామంది 200 యూనిట్ల లోపే కరెంట్ వాడుకున్నప్పటికి జీరో బిల్లులు మాత్రం రాకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.రూ.500 సబ్సిడీ గ్యాస్ సైతం దూరమైయ్యే పరిస్థితి. తాము దరఖాస్తు పెట్టుకున్నప్పటికి ఎందుకు జీరో బిల్లులు ఇవ్వడం లేదని విద్యుత్, మండల పరిషత్ అధికారులపై అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.మండలంలో గృహలకు సంబంధించి 5,512 మీటర్లు ఉన్నాయి.అయితే ఇందులో 3649 మంది మాత్రమే జీరో బిల్లుకు ఎంపికయినట్లుగా తెలుస్తోంది.మిగతా 1,863 పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
ఆన్ లైన్ ఎంట్రీలో తప్పిదాలు….
గ్రామాల్లో తీసుకున్న ప్రజాపాలన దరఖాస్తులు ప్రయివేటు ఆపరేటర్ల సహకారంతో ఆన్లైన్లో నమోదు చేశారు.ఇందులో చాలామందికి సరైన అనుభవం లేకపోవడంతో దరఖాస్తు దారుల పేర్లు, మిటర్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ నేఁబర్లు, మిటర్ యూపీఎస్ నెంబర్లు,గ్యాస్ కనెక్షన్ల నెంబర్లు తప్పుగా నమోదు చేశారు.ఈ దరఖాస్తులు నేరుగా విద్యుత్ శాఖ అధికారుల చేతికి వెళ్లడంతో వారుకుడా తప్పిదాలు సరి చేయకుండానే ఒకే చేయడంతో చాలామంది అర్హులైన వారుకుడా గృహజ్యోతి,సబ్సిడీ గ్యాస్ పథకాలకు దూరమైయ్యారు.
ఎడిట్ అప్సన్ లేక ఇబ్బందులు….
ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి ప్రభుత్వం మీ సేవా కేంద్రాల్లో, మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన ఈ సెంటర్ ఓపెన్ చేసి ఆపరేటర్లను ఏర్పాటు చేశారు.గృహజ్యోతికి,సబ్సిడీ గ్యాస్ బ్లాకు దరఖాస్తు చేసుకున్న చాలామందికి జీరో బిల్లులు రాకపోవడంతో ప్రజలు వందలాదిగా మండల పరిషత్ కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు
జీరో బిల్లు రానివారు మండల పరిషత్ లో సంప్రదించాలి..
సంపత్ యాదవ్..మండల విద్యుత్ శాఖ ఏఈ
జీరో బిల్లులు రానివారు అదైర్య పడవద్దు.ఆన్ లైన్ నమోదు చేయడంలో కొందరు ఆపరేటర్లు తప్పిదాలు చేశారు.జీరో బిల్లులు రానివారు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి.మండలంలో 5,512 మీటర్లు ఉండగా 3649 మంది మాత్రమే జీరో బిల్లుకు అప్రోచ్ అయ్యారు.
దరఖాస్తులు స్వికరిస్తున్నాం….శ్యాం సుందర్…మండల ఎంపిడిఓ
విద్యుత్ జీరో బిల్లులు,సబ్సిడీ గ్యాస్ అందనివారు మండల పరిషత్ కార్యాలయంలో సంప్రధించి సమస్యలను పరిస్కారం చేసుకోవాలి.నూతన దరఖాస్తులకు ఇంకా అప్సన్ ఇవ్వలేదు.ఇచ్చిన వెంటనే ఆన్లైన్లో నమోదు చేస్తాం.ఇప్పటికే రేండు సమస్యలపై 50కి పైగా దరఖాస్తులు వచ్చాయి.
ఎవరో ఆందోళన చెందవద్దు…..చింతలపల్లి మలహల్ రావు..మండల ఎంపిపి
జీరో బిల్లు,సబ్సిడీ గ్యాస్ అందని వారు ఎవరు ఆందోళన చెందవద్దు.వందశాతం అర్హులైన అందరికి జీరో విద్యుత్ బిల్లులు, సబ్సిడీ గ్యాస్ అందేలా ప్రభుత్వం అండగా ఉంటుంది.జీరో బిల్లులు రానివారు ప్రజాపాలన సేవ కేంద్రం మండల పరిషత్ కార్యాలయంలో సంప్రదించాలి.అవసరమైతే కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలి.