
ఆలూరు మండలంలోని గుత్ప గ్రామంలో జీరో విద్యుత్ బిల్లును మాజీ సర్పంచ్ గంట చిన్నయ అధ్వర్యంలో విద్యుత్ వినియోగదారులకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆరు గ్యారంటీ లో భాగంగా గృహ జ్యోతి పధకం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా గృహ జ్యోతి పధకం ప్రారంభించడం పట్ల గుత్ప మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గుత్ప మాజీ సర్పంచ్ గంట చిన్నయ్య ఎన్ఎస్యుఐ నియోజకవర్గ అధ్యక్షులు బాశెట్టి శశి కుమార్, సీనియర్ నాయకులు జితేందర్, భూమేశ్వర్, పోశన్న, ప్రసాద్, నజీర్, భూమేశ్వర్ యూత్ నాయకులు షబ్బీర్, జగదీష్, సతీష్, అరుణ్, సందీప్ పాల్గొన్నారు.