గృహ జ్యోతి పథకం లో జీరో విద్యుత్ బిల్లులు

నవతెలంగాణ – గోవిందరావుపేట
 గృహ జ్యోతి జ్యోతి పథకంలో జీరో విద్యుత్ బిల్లుల ద్వారా మండల వ్యాప్తంగా ఎంతో మందికి ఉపయోగ జరుగుతుందని పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పసర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో గృహ జ్యోతి పథకం జీరో విద్యుత్ బిల్లులను తీసి ప్రజలతో కలిసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజా పలనలో భాగంగా గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్తు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకంలో ఎలాంటి సమస్యలు తలెత్తిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని పరిష్కారం దిశగా కృషి చేస్తామని అన్నారు. ఈ పథకము ద్వారా మండల వ్యాప్తంగా వేలాది మందికి లబ్ధి చేకూరుతుందని నిజమైన అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తించేలా అధికారులు అన్ని విధాల చర్యలు చేపట్టాలని అన్నారు. నిజమైన ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని, ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని, ఆరోగ్య శ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయాలను కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మళ్ళీ గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్ పథకాన్ని మరియు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తూ పథకాలను ప్రారంభించారని అన్నారు. ఉచిత విద్యుత్ పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వడం వలన ప్రజల మొహాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది అని, ప్రజలు నిజమైన ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీది అని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డికి, సీతక్కకి ప్రజలందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని వాగ్ధానాలు నెరవేర్చే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని అన్నారు. రానున్న రోజుల్లో ఆరు గ్యారంటీ పథకాలలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లను కూడా ప్రారంభిస్తారని అన్నారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా పథకాలను ప్రారంభించేది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని అన్ని పథకాలు పేదలకు అందుతాయని అన్నారు. ఉచిత విద్యుత్ బిల్లులను ప్రజలతో పాటుగా సంబరాలు జరుపుకున్నాం అని అన్నారు. ప్రజల సంతోషంలో బాగం అయినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. విద్యుత్ అధికారులతో పాటు జీరో బిల్లులను ప్రజలతో పంచుకుంటూ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పులుగుజ్జు వెంకన్న, గ్రామ అధ్యక్షులు బద్దం లింగారెడ్డి, గ్రామ ఉపాధ్యక్షులు పంగ శ్రీను, యూత్ నాయకులు సప్పిడి సతీష్ రెడ్డి, గవ్వ సుధాకర్ రెడ్డి, వనుకూరి సతీష్ గార్లతో పాటుగా విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.