200 యూనిట్ల లోపు వారికి రాని జీరో బిల్లులు…

– గృహ విద్యుత్ వినియోగదారులు 30 వేలు…
– గృహ జ్యోతి లబ్ధిదారులు 16 వేలు..
– వెల్లువెత్తుతున్న దరఖాస్తులు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యుత్ శాఖ అశ్వారావుపేట సబ్ డివిజన్ లోని దమ్మపేట,అశ్వారావుపేట మండలాల్లో గృహ విద్యుత్ వినియోగదారులు 30 వేల గృహాలకు విద్యుత్ సౌకర్యం కలిగి ఉండగా ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరణ అనంతరం ప్రభుత్వం 16 వేల గృహ వినియోగదారులకు  మాత్రమే జీరో బిల్లు జారీ చేసింది.ఇందులో 200 యూనిట్ల లోపు వినియోగదారులకు సైతం ఎందరికో జీరో బిల్లు రాదు రాకపోవడంతో పేద ల్లో ఆందోళన కలుగుతుంది. జీరో బిల్లు రాని 200 యూనిట్లు లోపు వినియోగదారులు ప్రజా పాలన సేవా కేంద్రాల్లో తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించడంతో ఈ కేంద్రాల్లో దరఖాస్తులు వెల్లువెత్తున్నాయి. సోమ,మంగళ వారాల్లోనే రెండు రోజుల్లో అశ్వారావుపేట మండలం పరిషత్ లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రంలో రెండు వందల లోపు దరఖాస్తులు వచ్చాయి. నేరుగా విద్యుత్ శాఖ కార్యాలయంలోనే దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని గృహ విద్యుత్ వినియోగదారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.