మద్నూర్ మండల ప్రత్యేక అధికారిగా జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ


నవతెలంగాణ మద్నూర్: రాష్ట్రవ్యాప్తంగా ఎంపీపీ జడ్పిటిసి ఎంపీటీసీల పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను నియమించింది. మద్నూర్ మండల ప్రత్యేక అధికారిగా కామారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఆయన గురువారం మద్నూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ స్వీకరణ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి రాణి మండల పంచాయతీ అధికారి వెంకట నరసయ్య ఎంపీడీవో కార్యాలయ అధికారులు మండల గ్రామ పంచాయతీల కార్యదర్శిలు పాల్గొన్నారు.