షబ్బీర్ ఆలీని  కలిసిన జిల్లా పరిషత్ ఫోర్ లీడర్, జిల్లా ఉపాధ్యక్షులు

నవతెలంగాణ –  రామారావు
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ని  ఆదివారం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి , కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు     గీ రెడ్డి మహేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కామారెడ్డి నియోజకవర్గంలోని రామారెడ్డి మండలంలోని గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని కోరగా, సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా మహమ్మద్ షబ్బీర్ అలీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.