పీఆర్ టీయూ డైరీ ఆవిష్కరించిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ‌ఇరిగి పెద్దులు

నవతెలంగాణ – హాలియా
అనుముల మండల పీఆర్ టీయూ టీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు హాలియా పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ‌ఇరిగి పెద్దులు చేతుల మీదుగా డైరీ మరియు కేలండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు వినూత్నమైన రీతిలో బోధన చేస్తూ ఉపాధ్యాయులు సేవలు అందించాలని ఉపాధ్యాయులను కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో అనుముల మండల ప్రధాన కార్యదర్శి మంచికంటి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మందా సైదులు రావు గౌతమ్, మారం రవీందర్, తిరుమలగిరి సాగర్ మండల అధ్యక్షులు మొక్క పరుశ్ రామ్ గౌడ్, పెద్దవూర మండల ప్రధాన కార్యదర్శి నరందాస్ దుర్గ ప్రసాద్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు మేదరి దేవేందర్, జిల్లా కార్యదర్శి కుంచం హరివర్థన్,కవి శ్రీకళా రాంమూర్తి, జిల్లా నాయకులు కుందూరు కృష్ణా రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.