జొమాటోకు రూ.401 కోట్ల జిఎస్‌టి డిమాండ్‌ నోటీసు

న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ వేదిక జొమాటోకు ‘డైౖరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జిఎస్‌టి ఇంటెలిజెన్స్‌(డిజిజిఐ) డిమాండ్‌ నోటీసులు జారీ చేసింది. వినియోగదారుల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుపై జిఎస్‌టికి సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపింది. రూ.401 కోట్లు బకాయి పడినట్లు నోటీసులో పేర్కొంది. డెలివరీ అనేది సేవ కాబట్టి 18 శాతం జిఎస్‌టి చెల్లించాల్సిందేనని డిజిజిఐ స్పష్టం చేసింది.