– డెలివరీ ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు
బెంగళూరు : ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో తన వినియోగదారులపై మరోమారు భారం పెంచాలని నిర్ణయించింది. బుధవారం నుంచి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.10కి పెంచింది. ఇంతక్రితం ప్రతి ఆర్డర్‌పై రూ.7 వసూలు చేస్తుంది. దీనికి అదనంగా మరో రూ.3 పెంచినట్టు వెల్లడించింది. దేశంలో కొనసాగుతున్న పండుగ సీజన్ సందర్భంగా వినియోగదారులకు తమ సర్వీసుల్ని విజయవంతంగా అందించేందుకు వీలుగా ఈ ఫీజును పెంచాల్సి వచ్చిందని పేర్కొంది. తొలిసారి ప్లాట్‌ఫామ్ ఫీజును 2023లో ప్రవేశపెట్టింది. అప్పుడు రూ.2గా ఉండగా.. దీన్ని క్రమంగా పెంచుతూ వచ్చింది. ఈ సంస్థ రోజుకు సగటున 20-25 లక్షల ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేస్తోందని అంచనా.