
కామారెడ్డి జిల్లాకు ఇటీవలే నూతనంగా నియమితులైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు కు ఉమ్మడి నిజాంసాగర్ బీజేపీ నాయకులు కామారెడ్డి బీజేపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త బీజేపీ నాయకులు కొండ అనిల్ గుప్తా మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ విజయానికి మండలంలోని పార్టీ కార్యకర్తలు అందరం కలిసి పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు బోయిని సాయిలు, ఒంటరి నారాయణరెడ్డి, బీజేవైఎం రాజు, పండరి తదితరులు పాల్గొన్నారు.