నవతెలంగాణ- ఆర్మూర్
సైన్స్ డే సందర్భంగా మండల స్థాయి ఫిజికల్ సైన్స్ టెస్ట్ జెడ్ పి హెచ్ ఎస్ ప్రధానోపాధ్యాయులు అధ్యక్షతన శుక్రవారం కేంద్రంలో నిర్వహించినారు. మండల స్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో 8 పాఠశాలల విద్యార్థులు పాల్గొనడం జరిగింది అందులో ముగ్గురు విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపిక కావడం జరిగింది వారిలో జి శివాని జడ్పీహెచ్ఎస్ రామన్నపేట్ కే జస్వంత్ జడ్పిహెచ్ఎస్ అంక్సాపూర్ ఎం శివన్విత జడ్పీహెచ్ఎస్ మోతే ఎంపిక కావడం జరిగింది జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎఫ్ పి ఎస్ టి జిల్లా కార్యదర్శి. పసుపుల రఘునాథ్ మండల అధ్యక్షులు గోపాల్, సెక్రెటరీ దేవా శ్రీనివాస్, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు గణేష్ శ్రీధర్ గంగా మహేష్, ఉమారాణి, మురళీకృష్ణ, వెంకటేశ్వర్ మనోహర్ , విద్యార్థులు పాల్గొన్నారు.