మండల స్థాయి ఫిజిక్స్ టాలెంట్ టెస్ట్

– విజేతలకు బహుమతుల ప్రధానం 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మండల స్థాయి ఫిజిక్స్ టాలెంట్ టెస్ట్  నిర్వహించారు. మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల నుండి ముగ్గురు చొప్పున విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మండల స్థాయి ఫిజిక్స్ టాలెంట్ టెస్ట్ లో కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెందిన రచిత ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. చౌట్ పల్లి ఉన్నత పాఠశాలకు చెందిన సభ సాదియా రెండవ స్థానం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థిని తనుష్క తృతీయ స్థానం సాధించారు. మండల స్థాయిలో గెలుపొందిన విజేతలు ఈనెల 4న జిల్లా కేంద్రంలో జరుగనున్న జిల్లాస్థాయి ఫిజిక్స్ టాలెంట్ టెస్ట్ లో పాల్గొంటారని పరీక్షల ఇంచార్జ్ సరోజన లక్ష్మీ తెలిపారు. అనంతరం విజేతలకు కమ్మర్ పల్లి ఎఫ్సీ ఎస్టీ ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు పసుపుల సాయన్న, ఆయా పాఠశాలల భౌతికశాస్త్ర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.