మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం తరపున మండలస్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఏర్గట్ల కేజీబీవీ పాఠశాల విద్యార్థిని శ్రీనిధికి ప్రథమ బహుమతి, తడపాకల్ జడ్పిహెచ్ఎస్ పాఠశాల విద్యార్థి కుల్షన్ కు ద్వితీయ,ఏర్గట్ల జడ్పిహెచ్ఎస్ విద్యార్థిని అస్నియా భాను కు తృతీయ బహుమతి లభించిందని పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ తెలిపారు.టాలెంట్ టెస్ట్ ల ద్వారా విద్యార్థుల ప్రతిభను గుర్తించవచ్చని అన్నారు.భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు రాజశేఖర్, సుధాకర్, విఘ్నరాజ్, రవి, వినోద్, స్రవంతి పాల్గొన్నారు.