జోనల్ క్రీడలను విజయవంతం చేయాలి

నవతెలంగాణ మోపాల్ 

మోపాల్ మండల కేంద్రంలోనీ కంజర గ్రామంలో గల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈనెల 11 నుండి 14 వరకు నిర్వహించనున్న పదవ జోనల్ సాయి క్రీడోత్సవాలను విజయవంతం చేయాలని ప్రిన్సిపల్ విజయలత కోరారు. జోనల్ పరిధిలోని నిజామాబాద్, అదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్ 14 బాలికల గురుకులాలకు చెందిన 1190 క్రీడాకరినీలు జోనల్ క్రీడా పోటీల్లో పాల్గొన్న ఉన్నట్లు తెలిపారు మూడు జిల్లాలకు చెందిన డీసివోలు జెడ్ ఓ లు, మల్టీ జోనల్ ఆఫీసర్లతో పాటు 14 గురుకులాల ప్రిన్సిపల్, పిఈటిలు, పీడీలు కేర్ టేకర్లు పాల్గొంటారని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉదయ్ శీల, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ సునీత, పేటీ ఎం లత తదితరులు పాల్గొన్నారు