పరిశుభ్రతను పాటించాలి: జెడ్పీ చైర్మన్ డీ.విఠల్ రావు

నవతెలంగాణ – మాక్లూర్
ప్రతి గ్రామంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా జెడ్పీ చైర్మన్ దాదాన్నగరి విఠల్ రావు తెలిపారు. మండల కేంద్రంలో ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాలు కార్యక్రమంలో పాల్గొని, రోడ్లను శుభ్రపరచారు. చేత్తను గ్రామపంచాయతీ ట్రాక్టర్లో వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారిణి జయసుధ, ఎంపీడీఓ క్రాంతి, ఎంపీవో శ్రీనివాస్, కార్యదర్శి రాకేష్, పంచాయతీ సిబ్బంది, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.