ఆర్థిక సాయం అందించిన జెడ్పీ కో ఆప్షన్ 

నవతెలంగాణ -వీర్నపల్లి 
నిరుపేద కార్మికుడి కుటుంబంకు ఆర్థిక సాయం ను జెడ్పీ కో ఆప్షన్ చాంద్ పాషా అందించారు.రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలం బంజేరు గ్రామం శనివారం గ్రామపంచాయతి కార్మికుడు ఎడెల్లి శంకర్ అనారోగ్యంతో ఇటివల మృతి చెందారు  విరి కుటుంబాన్ని జెడ్పీ కో ఆప్షన్ చాంద్ పాషా పరామర్శించి 5000 నగదు, రఫీ 2000 నగదు అందించారు. జెడ్పీ కో ఆప్షన్ చాంద్ పాషా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుక వెళ్లి అదుకొనెలా చర్యలు తీసుకుంటామని అదైర్య పడద్దని బరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బి అర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రఫీ, ఎస్పీ సెల్ మండల అధ్యక్షులు మల్యాల అశోక్, ఉప సర్పంచ్ ఎల్లవ్వ, మండల నాయకులు తుడుము జలేందర్, రతి లాల్ విష్ణు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.