మాజీ మావోయిస్టును కలిసిన జడ్పీ ఫ్లోర్ లీడర్

నవతెలంగాణ – తొర్రూర్ రూరల్ 

మాజీ మావోయిస్టు చాంద్ బి అలియాస్ జ్యోతక్క (63) మండలంలోని హరిపిరాల గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు గత 35 సంవత్సరాల క్రితం అప్పటి పీపుల్స్ మావోయిస్టు ఉద్యమంలో పనిచేసే లొంగిపోయి స్వగ్రామంలో హరిపిరాల గ్రామానికి వచ్చిన సందర్భంగా స్థానిక జడ్పిటిసి మహబూబాబాద్ జెడ్పి ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా జ్యోతి అక్క  ఆరోగ్య గురించి వాకాబు చేసి జనజీవన స్రవంతిలో కలిసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.