పాఠశాల భవనాన్ని ప్రారంభించిన జెడ్పీటీసీ..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలం అనంతారం గ్రామంలో ఎంపీటీసీ సామల వెంకటేష్  మండల ప్రజా పరిషత్ నిధుల నుండి దాదాపుగా 12 లక్షల వ్యయంతోని  పాఠశాల భవనం నిర్మించగా, ముఖ్యఅతిథిగా భువనగిరి జెడ్పిటిసి సుబ్బురు బీరు మల్లయ్య హాజరై, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల భవనంతో పాటుగా ఫ్యాన్లు లైట్లతో సహా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారని, విద్యార్థులు బాగా చదవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు సామల వెంకటేష్, అనంతారం గ్రామ మాజీ సర్పంచ్ చిందం మల్లికార్జున్, మాజీ విద్యా కమిటీ చైర్మన్ సింగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అనంతారం టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బొట్టు మల్లేశం, టిఆర్ఎస్ యూత్ ప్రధాన కార్యదర్శి గుమ్ముల మధు, బిఆర్ఎస్ నాయకులు ర్యాకల శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు బొబ్బల మీనా రెడ్డి, అనంతారం బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు వినోద్, ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ రంగరాజన్, ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టరు వినోద, ఉపాధ్యాయురాలు సబితా, శోభ, పీఏసీఎస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, మచ్చ కృష్ణ, సామల గణేష్, పల్లెపాటి నరసింహ, కృష్ణ, సుబ్బూరి రమేష్, కట్కూరి శ్రీనివాస్,  విద్యార్థులు పాల్గొన్నారు.