– గిరిజన తండాల అభివృద్ధికి రూ.3 కోట్ల65 లక్షల మంజూరు
– విద్యాశాఖ మంత్రికి కృతజ్ఞతలు : గిరిజనులు
నవతెలంగాణ-కందుకూరు
మారుమూల గిరిజన తండాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు. గురువారం కందుకూరు మండల పరిషత్ కార్యాలయంలో ఆయన ఛాంబర్‌లో మహేశ్వరం మార్కెటింగ్ చైర్మన్ సురసాని సురేందర్‌రెడ్డితో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో కందుకూరు మండలంలో తండాల అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నట్టు తెలిపారు.ఎస్టీసబ్‌ప్లాన్ కింద మండల పరిధిలోని సార్లరావులపల్లి, పులిమామిడి, గాజుల బురుజు తండా(బేగంపేట్), గుమ్మడవెల్లి తండాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.3 కోట్ల 65 లక్షల నిధులు మంజూరైనట్టు వెల్లడించారు. సార్లరావులపల్లికి రూ.30 లక్షలు, పులిమామిడికి రూ.2 కోట్లు, గాజులబుర్జుతండాకు రూ. 50 లక్షలు, గుమ్మడవెల్లికి రూ. 85 లక్షలు మంజూరైనట్టు తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికీ గిరిజన తండా వాసులు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీఅర్‌ఎస్ పార్టీకి తిరుగులేని మెజార్టీతో తెలంగాణ రాష్ట్రం లో మూడోవసారి అధికారంలోనికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మహేష్ గౌడ్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కాకి దశరథ, మహేశ్వరం మార్కెట్ కమిటీ డైరెక్టర్ పొట్టి ఆనంద్, బాచుపల్లి సర్పంచ్ యాలాల శ్రీనివాస్, బీఆర్‌ఎస్ మండల యువజన విభాగం అధ్యక్షులు కొలను విఘ్నేశ్వర్ రెడ్డి, సోషల్ మీడియా మండల్ కన్వీనర్ బొక్క దీక్షిత్ రెడ్డి, కార్యాలయ కార్యదర్శి బక్కం వెంకటేష్, యూత్ ఉపాధ్యక్షులు గొఱ్ఱంకల రామకృష్ణ, బీఆర్‌ఎస్ నాయకులు జంగయ్య, మాధవరెడ్డి, కృష్ణ, దేవేందర్ గౌడ్ పాల్గొన్నారు.