సమావేశానికి కార్యకర్తలందరూ రావాలి: జెడ్పీటీసీ కమల నరేష్ పిలుపు

నవతెలంగాణ –  మోపాల్
సోమవారం రోజున రూరల్ నియోజకవర్గం సంబంధించి రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విస్తృత స్థాయి సమావేశం ఉంటుంది. కావున బీఆర్ఎస్ సైనికులు కార్యకర్తలు, ప్రజలు రావాలని జెడ్పీటీసీ కమల నరేష్ తెలిపారు. ఈ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత మరియు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ హాజరవ్వడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మోపాల్ మండల సంబంధించిన నాయకులందరూ తప్పక హాజరవ్వాలని ఆయన కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ బలం చూయించి కచ్చితంగా ఇప్పుడు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ గడ్డపైన బీఆర్ఎస్ జెండా ఎగర వేయాలని ఆయన కోరారు.