నవతెలంగాణ- నాంపల్లి: మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన బుషిపాక నరసింహ, తుంగపహాడ్ గ్రామానికి చెందిన నేతళ్ల సత్తయ్య శనివారం రోజు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న నాంపల్లి జెడ్పిటిసి ఎలుగోటి వేంకటేశ్వర్ రెడ్డి శనివారం మృతుల గృహాలకు వెళ్లి మృత దేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం ఇరువురి కుటుంబ సభ్యులకు చెరో రూ.10వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఆయనతో పాటుగా వడ్డేపల్లి సర్పంచ్ బుషిపాక లీలప్రియ నాగేష్, తుంగపహాడ్ సర్పంచ్ దండిగ అలివేలు నరసింహ, వడ్డేపల్లి మాజీ సర్పంచ్ వట్టి కోటి సుధాకర్, ఎంపీటీసీ సరిత కిరణ్, బీఆర్ఎస్ మండల నాయకులు గజ్జేల గెల్వాల్ రెడ్డి, చలమల నరేందర్ రెడ్డి, వార్డు సభ్యులు జెట్టబోయిన శ్రీశైలం, చాపల యాదయ్య, నేతళ్ళ నరేష్, నేతళ్ళ కొండలు, నరసింహ, పుల్కరం యాదయ్య, నేతళ్ల బిక్షం, కుమార్, వడ్లకొండ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.