– ప్రీ క్వార్టర్స్‌లో జర్మనీ స్టార్
– వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్
లండన్ (ఇంగ్లాండ్): జర్మనీ స్టార్, నాల్గో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ దూకుడు కొనసాగించాడు. పురుషుల సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు కామెరూన్‌పై వరుస సెట్లలో విజయం సాధించాడు. 6-4, 6-4, 7-6(17-15)తో వరుస సెట్లలో కామెరూన్‌ను జ్వెరెవ్ చిత్తు చేశాడు. 15 ఏస్‌లు సంధించిన అలెగ్జాండర్ జ్వెరెవ్.. రెండు బ్రేక్ పాయింట్లతోనే కామెరూన్‌పై పైచేయి సాధించాడు. 9 ఏస్‌లు కొట్టిన కామెరూన్ ఒక్క బ్రేక్ పాయింట్ సాధించలేకపోయాడు. పాయింట్ల పరంగా 118-95తో జ్వెరెవ్ పైచేయి సాధించాడు. టాప్ సీడ్, ఇటలీ ఆటగాడు జానిక్ సినర్ సైతం ప్రీ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. 6-1, 6-4, 6-2తో సెర్బియా ఆటగాడు మియోమిర్‌పై వరుస సెట్లలో అలవోక విజయం సాధఙంచాడు. 11 ఏస్‌లు కొట్టిన సినర్.. ఐదు బ్రేక్ పాయింట్లతో మెరిశాడు.
మహిళల సింగిల్స్‌లో 13వ సీడ్, జెలెనా ఒస్టాపెంకో ప్రీ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. బ్రిటన్ అమ్మాయి బెర్నార్డ పెరాపై 6-1, 6-3తో సులువుగా విజయం సాధించింది. ఆరు బ్రేక్ పాయింట్లు సాధించిన ఒస్టాపెంకో పెద్దగా కష్టపడకుండానే మూడో రౌండ్‌లో గెలుపొందింది. పాయింట్ల పరంగా 60-38తో తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. మరో మ్యాచ్‌లో అనా 7-6(7-4), 6-2తో సమ్సోనోవపై వరుస సెట్లలో విజయం సాధించింది.