నవ తెలంగాణ- సరూర్‌నగర్
అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ పోటీలలో బాలానగర్ శోటో ఖాన్ ఇన్స్టిట్యూట్ కు చెందిన గోనెల గౌరీ శంకర్, వి .కీర్తన లు సత్తా చాటారు అని ఇన్స్టిట్యూట్ మాస్టర్ మురళి తెలిపారు. సోమవారం సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ న్యూ డ్రాగన్ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండో అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ పోటీలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ పోటీలకు నాలుగు దేశాలకు చెందిన విద్యార్థులు దాదాపు 2500 మంది పాల్గొనడం జరిగిందని అన్నారు. కాగా బిలో 12 ఇయర్స్ విభాగంలో తమ ఇన్స్టిట్యూట్ కు చెందిన విద్యార్థులు గౌరీ శంకర్, కీర్తన లు మూడవ స్థానంలో నిలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం మార్షల్ ఆర్ట్స్ విద్యను ప్రోత్సహిస్తూ తమకు సహకారం అందిస్తే ఇలాంటి బహుమతులను ఎన్నో గెలిచి దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటుతామని తెలిపారు.