పాత పెన్షన్ సాధన సహకార సభ విజయవంతం..

– హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎన్ నరేందర్ రావు 
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
పాత పింఛన్ సాధన సహకారసభ విజయవంతమైన సందర్భంగా ఉద్యోగులందరికీ టీఎస్ సిపిఎస్ ఈయు హైదరాబాద్ జిల్లా తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని జిల్లా అధ్యక్షుడు ఎన్ నరేందర్ రావుతెలిపారు.ఆదివారంఆయనమాట్లాడుతూ..ఉద్యోగులను పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులుగా మార్చి ఉద్యోగుల  భవిష్యత్తును, పెట్టుబడి దారి తళారి చేతిలో పెట్టిన ఈ దళారీ పెన్షన్ విధానం (కాంట్రిబ్యూటరీ పెన్షన్  విధానం) ను అంతమొందించాలని  పంతంతో చేపట్టినది. ఈ పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర. యాత్ర ముగింపు సభ నాంపల్లి లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించామని ఈ సభకు పెద్ద ఎత్తున ఉద్యోగులు హాజరై విజయవంతం చేసిన ఉద్యోగ ఉపాధ్యాయ లందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.ఇలానే భవిష్యత్తులో ఇదే పోరాటం స్ఫూర్తిని కొనసాగించాలి అని కోరుకుంటున్నాం అన్నారు.
Spread the love