నవతెలంగాణ-కంటోన్మెంట్
తెలంగాణ ఫిస్ట్ బాల్ అసోసియేషన్ సహకారంతో కంటోన్మెంట్ బోయినపల్లి ప్లే గ్రౌండ్‌లో శ్రీ పతి వెంకట రావు మెమోరియ ఫిస్ట్ బాల్ రాష్ట్ర స్థాయీ పాఠశాలల మొదటి పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. శ్రీపతి రఘు చరణ్ తన తండ్రి జ్ఞాపకార్థం ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. సందర్భంగా ఫిస్ట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర ఛైర్మెన్ జంపన ప్రతాప్ రఘు చరణ అభినందించారు. అనంతరం పాల్గొంటున్న క్రీడాకారుల ను పరిచయం చేసుకుని టాస్ వేసి పోటీలు ప్రారంభిం చారు. తన తండ్రి శ్రీపతి వెంకట్ రావు జ్ఞాపకార్థం రాష్ట్ర స్థాయి పోటీలను మొదటిసారి నిర్వహిస్తున్నామనీ, భవిష్యత్తులో జాతీయ స్థాయిలో నిర్వహిస్తామని శ్రీ పతి రఘుచరణ్ తెలిపారు. ఫిస్ట్ బాల్ అసోసియేషన్ సెక్రెటరీ కొమ్ము వెంకట్ జంపన ప్రతాప్ మాట్లాడుతూ నాలు గండ్లు క్రితం ప్రారంభమైన ఫిస్ట్ బాల్‌కు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. జిల్లా రాష్ట్రీయ జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మొదటిసారి మెమోరియల్ ఫిస్ట్ బాల్ పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 17న జాతీయ స్థాయి లో నాగర్ కోయిల్ లో ఫిస్ట్ బాల్ జరుగుతున్నాయనీ, రాష్ట్ర బాల బాలికల జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయ ని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రభుకుమార్ గౌడ్, సత్యనారాయణ, స్టాన్లీ, మునిరాజ్ జగదీష్, విక్రమ్, హౌప్ విజరు, వరప్రసాద్, పేరుక మహేందర్, తదితరులు పాల్గొన్నారు.