నవతెలంగాణ-దుండిగల్
కుతుబుల్లాపూర్ నియోజక వర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో అటవీ అధికారుల రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు మంగళవారం దూలపల్లిలోని తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీలో ప్రారంభమయ్యాయి. నేటి నుండి రెండు రోజులపాటు జరిగే క్రీడలలో చార్మినార్, భద్రాద్రి, రాజన్న, యాదాద్రి, జోగులాంబ, బాసర, కాళేశ్వరం అటవీ సర్కిల్లకు చెందిన వివిధ జిల్లాల నుండి వచ్చిన అటవీ అధికారులు పాల్గొన్నారు. అటవీ క్రీడల ప్రారంభోత్సవానికి అటవీ దళాల అధిపతి అటవీ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి రాకేశ్ మోహన్ డోబ్రియాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరమని, నిత్యం చేసే పనుల నుండి అటవీ ఉద్యోగులకు క్రీడలు వెసులుబాటుని స్తాయని, ప్రతీ ఒక్కరూ క్రీడా స్పూర్తితో పాల్గొని ఈ క్రీడలను మంచి జ్ఞాపకంగా గుర్తుండిపోయేలా చేయాలని అన్నారు. ప్రతీ రెండు సంవత్సరములకు ఒకసారి నిర్వహించే ఈ క్రీడలను వివిధ పరుగు పందేలు, లాంగ్ జంప్, వెయిట్ లిఫ్టింగ్, డిస్కస్ త్రో, క్యారమ్స్, చెస్, రైఫిల్ షఉటింగ్, బ్యాడ్మింటన్, కబడ్డీ, క్రికెట్ మొదలగు అంశాలలో పురుషులు, మహిళల విభాగాలలో నిర్వహిస నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అకాడమీ సంచాలకులు ఎల్యుసింగ్ మేరు, అటవీ శాఖ ఉన్నతాధికారులు, ఎం సి పర్గెయిన్, జి చంద్రశేఖర రెడ్డి, సునీత భగవత్, సోనీ బాలా దేవి, వినోద్ కుమార్, రామలింగం, రమేశ్, సైదులు, భీమా నాయక్, శివాని డోగ్రా, వివిధ జిల్లాల అటవీ అధికారులు, డివిజనల్ అధికారులు, అకాడమీ అధికారులు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.