– కార్పొరేటర్ ఆవుల రవీందర్
నవతెలంగాణ-బాలానగర్
కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలోని బాలానగర్ డివిజన్ రాజు కాలనీ మెయిన్ రోడ్డులో బీటీ రోడ్డు పనులకు సోమవారం కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. గతంలో డ్రయినేజీ, మంచినీటి పైపులైన్ల కోసం రోడ్లను తవ్విన మూలంగా రోడ్డు పనులను నిలిపి వేశారని తెలిపారు. బాలానగర్ డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడమే లక్ష్యం అన్నారు. బాలానగర్‌లో రవాణా సౌకర్యం మెరుగు పర్చాలనే దృడ సంకల్పంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నేతృత్వంలో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. కార్యక్రమం లో జీహెచ్‌ఎంసీ ఏఈ రషీద్, వర్క్ ఇన్‌స్పెక్టర్ రాములు, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు ఎం.ఎస్ కుమార్, నర్రా దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్, నాగేందర్ గౌడ్, కందుల రమేష్, ఎం.సుధాకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, గౌతమ్ పాల్గొన్నారు.