– సికింద్రాబాద్‌లో బెంబేలెత్తుతున్న ప్రజలు
– రెట్టింపు ఫాగింగ్, చేయాలంటూ వినతి
నవతెలంగాణ-ఓయూ
సికింద్రాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు గత రెండు నెలలుగా దోమలతో బెంబేలెత్తుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని తార్నాక, సీతాఫల్ మండి, బౌద్దనగర్, మెట్టుగూడా, అడ్డగుట్ట ఈ ఐదు డివిజన్లలో కొన్ని రోజులుగా దోమల సంచారం రెట్టింపు సంఖ్యలో సాగుతోంది. నానాటికి దోమల వద్ధి పెరిగిపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా తార్నాక, అడ్డగుట్ట, డివిజన్‌లలో వీటి తీవ్రత మరింత ఉందని స్థానికులు అభి ప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం వీటి నివా రణకు రెట్టింపు చర్యలు చేపట్టాలి కానీ తూతుమంత్రంగా చర్యలు చేపట్టుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇంటా ఆరు బయట బెడద
ఇక దోమలు కేవలం నివాసాల్లోనే కాదు సాయంత్రం ఆరు గంటలు దాటితే ఆరుబయట వీధుల్లో సమూహాలుగా సంచరి స్తూన్నాయి. బయట ఎవరైనా ఉండి మాట్లాడుతుంటే దోమలు వారిని కుడుతున్నాయి. దాంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు సాయం త్రం అయితే ఆరుబయటకు రావడానికి జంకుతున్నారు.
ఇండ్లల్లో మోత మోగిస్తున్న దోమలు
ఇక సాయంత్రం ఇండ్లల్లో తలుపులు, కిటికీలు తెరిచుంటే దోమలు దూరి ఆ ఇంటి వారిని ఇబ్బంది పెడుతున్నాయి. దాంతో తలుపులు తెరవలంటే స్థానికులు జంకుతున్నారు. ఇక పరిసరాల్లో, ఆరుబయట, సింక్స్, వద్ద కూడా ఇవి భారీగానే ఉంటున్నాయి.
నాలా పరిహక ప్రజలకు చుక్కలు
తార్నాక డివిజన్ పరిధిలో ఓపెన్ నాల, ఇతర ప్రాంతాల్లో చిన్న చితక ఓపెన్ నాల పరిసరాల్లో నివాసించే స్థానికులు దోమ ల రెట్టింపు బాధలు ఎదుర్కొంటున్నారు. ఇక ఇక్కడ స్థానికులు దోమలతో తరుచూ మలేరియా, డెంగ్యూలతో అనారోగ్యానికి గుర వుతున్నారు. వర్షాకాలం ముగిసి ఇన్నాళ్లు అవుతున్నా, వేసవి తీవ్రత తీవ్రమైన దోమలు బెడద తగ్గకపోవడం శోచనీయం. నిత్య ం దోమ ల లార్వా వృద్ధి చెందుతూ దోమలు మరింతగా రెచ్చిపోతున్నాయి.
ఫాగింగ్ రెట్టింపు చేయాల్సిందే
సికింద్రాబాద్ జోన్ ఎంటమాలజీ విభాగం అధికారుల ప్రకా రం ప్రతీ కాలనిలో నెలకు రెండుసార్లు ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్ నెలకు 4 మార్లు చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ ఎంట మాలజీ సిబ్బంది, ఉద్యోగులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఇతర విధుల్లో పాల్గొనడంతో ఫాగింగ్, లార్వా ఆపరేషన్ సరిగ్గా జరగడం లేదని తెలిసింది. ఇక తార్నాకలోని ఎర్రకుంటా చెరువులో గుర్రుపు డెక్కపై దోమలు రెట్టింపుతో పరిసరాల్లో స్థానికులకు చుక్కలు చూపిస్తున్నాయి.
దోమల నియంత్రణకు చర్యలు
నిబంధనల ప్రకారం ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్ చేస్తున్నాము. ఇక ఓపెన్ నాలలపై మస్కిటో లార్వా సైడల్ ఆయిల్ నిత్యం మా సిబ్బంది స్ప్రే చేస్తున్నారు. ఇవి కాకుండా నివాసాల్లో లార్వా వద్ధి చెందకుండా మా ఏఎల్‌ఓలు కషి చేస్తున్నారు. నాల పరిహక ప్రాంతాల్లో ప్రజలు నాలలో దుప్పట్లు, దిండ్లు, చెత్త, పరు పులు వేయవద్దు. అలాగే అపార్టుమెంట్‌ల వాసులు నీళ్లు నిల్వ కుం డా, పూల మొక్కల కుండీల్లో నీళ్లు నిల్వకుండా చొరవ చూపాలి. మా సిబ్బందిని అపార్టుమెంట్‌లలోకి అనుమతించాలి. అప్పుడే దోమల నియంత్రణ సాధ్యమవుతుంది.
– సికింద్రాబాద్ జోన్ సీనియర్ ఎంటమాలజిస్టు
పి.దుర్గ ప్రసాద్